తొలిరోజు జైల్లో సల్మాన్ ఏం చేశాడో తెలుసా.?

SMTV Desk 2018-04-06 15:21:07  salman khan, salmaan in jail, jodhpur court verdict.

ముంబై, ఏప్రిల్ 6 : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు 1998లో రెండు కృష్ణ జింకలను చంపిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. జోధ్‌పూర్ కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటలకే ఆయనను సెంట్రల్ జైలుకు తరలించారు. ఇంతకి సల్మాన్ తోలి రోజు జైల్లో ఏం చేశాడో తెలుసా.? విశ్వసనీయ సమాచారం మేరకు.. సల్మాన్ కు ఖైదీ నెంబరు 106 కేటాయించారు. జైలు సిబ్బంది ఆయనకు 4 దుప్పట్లు ఇచ్చి ఒక కూలర్‌ను ఏర్పాటు చేశారు. ఓ చెక్క బల్లపై సల్మాన్ నిద్రించారు. నేడు తనకు బెయిలు వస్తుందని ఆశిస్తున్నారు. జైలులో ఆయనకు తినడానికి రొట్టెలు, పప్పు ఇవ్వగా వాటిని తినేందుకు సల్మాన్ తిరస్కరించారు. పలు వార్త పత్రికల సమాచారం ప్రకారం.. సల్మాన్ ఖాన్ మేనేజర్ ఆయన కోసం హోటల్ తాజ్ నుంచి ప్యాక్‌డ్ ఫుడ్ ఐటమ్స్, బట్టలు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.