ఆసక్తి రేపుతున్న "భలేమంచి చౌక బేరమ్" ట్రైలర్

SMTV Desk 2018-03-31 16:42:31  BHALE MANCHI CHOWKA BERAM, BALE MANCHI CHOWKA BERAM TRAILER,

హైదరాబాద్, మార్చి 31 : దర్శకుడు మారుతి అందించిన కథతో "రోజులు మారాయి" దర్శకుడు మురళీకృష్ణ.. "భలేమంచి చౌక బేరమ్" సినిమాను రూపొందిస్తున్నాడు. నవీద్, నూకరాజు, యామిని ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. 30 ఏళ్ళ అనుభవం ఉన్న ఓ ఆర్మీ ఆఫీసర్ తన అనుభవంతో దేశానికి సంబంధించిన రహస్యాలను ఒక ఫైల్ చేసి ఉంచుతాడు. అనుకోకుండా ఆ ఫైల్ ఇద్దరు యువకులకు దొరుకుతుంది. వారిద్దరూ దేశ రహస్యాలను శత్రుదేశస్తులకు అమ్మేయడానికి సిద్ధపడతారు. ఇంతకి వారు ఆ రహస్యాలను అమ్మేశారా.? లేదా.? అనే విషయాలు తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న ఈ ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.