అమ్మను పొగడ్తలతో ముంచెత్తిన నాని..

SMTV Desk 2018-03-31 15:07:36  actor nani, nani tweet his mother, nani mother last day work.

హైదరాబాద్, మార్చి 31 : నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన సినిమాలు, కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇటీవల తన తనయుడి పుట్టిన రోజును పురస్కరించుకొని కారులో తన బాబుతో ఉన్న ఫోటోను పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా తల్లి విజయలక్ష్మితో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. నాని తల్లి పదవి విరమణ చేశారు. ఈ నేపథ్యంలో నాని.. "ఫార్మాసిస్ట్‌గా 30 ఏళ్ల అనుభ‌వం. ఎప్పుడూ న‌వ్వుతూ ఉండే ముఖం, ఎవరికైనా స‌హాయం చేయ‌డానికి ముందుంటుంది. వైద్యులు, రోగులు ఆమెను ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు. మేం అంత‌కంటే ఎక్కువ ప్రేమిస్తాం. ఈ రోజు ఆమె చివ‌రి వ‌ర్కింగ్ డే. చాలా గ‌ర్వంగా ఉంద‌మ్మా. నువ్వు చాలా అద్భుతమైన వ్యక్తివి" అంటూ నాని ట్వీట్ చేశాడు. నాని ప్రస్తుత౦ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న "కృష్ణార్జున యుద్ధం" సినిమాలో నటిస్తున్నారు. నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా ప్రీ-రిలీజ్‌ వేడుకను ఈ రోజు సాయంత్రం తిరుపతిలో నిర్వహించనున్నారు.