రష్యాలో ఘోర అగ్ని ప్రమాదం..53 మంది మృతి

SMTV Desk 2018-03-26 13:22:12  Russia, fire, shopping mall, 53 dead

రష్యా, మార్చి 26: సైబీరియా రాష్ట్రం కెమెరోవో పారిశ్రామిక నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ షాపింగ్‌ మాల్‌లో జరిగిన ప్రమాదంలో 53 మంది మృతి చెందినట్లు రష్యా అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రష్యా మీడియా తెలిపిన వివరాల ప్రకారం..కెమెరొవోలోని వింటర్‌ చెర్రీ షాపింగ్‌ సెంటర్‌లో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సెంటర్‌లో మల్టిప్లెక్స్‌ సినిమా థియేటర్లు, స్పా, బౌలింగ్‌ తదితర సౌకర్యాలు ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా షాపింగ్‌ సెంటర్‌లో మంటలు ఎగసిపడ్డాయి. చూస్తుండగానే మంటలు షాపింగ్‌మాల్‌ అంతా వ్యాపించాయి. సమాచారమందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు