నాడి వ్యవస్థ బాగుండాలంటే

SMTV Desk 2019-12-03 12:13:20  

మనకు ప్రాణావసరమైనవన్నీ దాదాపు ప్రకృతిలోనే లభిస్తాయి. అరణ్యాల నుంచి ప్రవహిస్తూ ఎన్నో ఔషధగుణాలను ఇముడ్చుకున్న నీళ్లు, మధుర ఫలాలు, కాయగూరలు, ఎన్నో విలువైన ఖనిజాల్ని, విటమిన్లనీ దాచుకున్న పచ్చని ఆకుకూరలు ఇవి ప్రకృతి ఇచ్చిన వరాలు.సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడే పీచు, ఫిలో కెమికల్స్, బీటా కెరోటిన్, క్లోరోఫిల్, లూటెన్ వంటివి దాచుకున్న ఆకుకూరలకు క్లోరోఫిల్ చక్కని పచ్చని రంగును ఇచ్చింది. ఈ క్లోరోఫిల్ మానిక్యూల్ స్ట్రక్చర్ మానవ శరీరంలోని రక్తంలోని హిమోగ్లోబిన్తో పోల్చదగినది. హిమోగ్లోబిన్కు ఐరన్ కావాలి. క్లోరోఫిల్కు మెగ్నీషియం కావాలి. ఇలా చూస్తే ఆకుకూరలు సహజంగానే రక్తాన్ని వృద్ధిచేసే ఆహారంగా చూడొచ్చు. ఈ ఆకుకూరల్ని ఉడికించి తింటే బరువు తగ్గించటంలో, దృష్టిని, నాడీ వ్యవస్థ నియంత్రణని మెరుగుపరచటంలో, దంత, ఎముక పుష్టిని ఇవ్వటంలో, వార్ధక్య లక్షణాలను పొడిగించటంలో సహకరిస్తాయి. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి.
*మొరింగ్ గ్రీన్స్ (మునగ)
మునగచెట్టు ఆకులు, కాయలు, గింజలు, పూలు, బెరడు అన్నింటిలోనూ అపార ప్రయోజనాలు ఉన్నాయి. మునగ ఆకుల్లో విటమిన్కె, సి, పుష్కలంగా వున్నాయి.
గోంగూరలో విటమిన్లు, ఖనిజాలు ఆర్గానిక్ పోషకాలు ఆక్సాలిక్ యాసిడ్లు, ప్రోటీన్లు, పీచు అత్యధికంగా ఉన్నాయి.
*అమరంత్ ఆకులు
ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఉండే ఈ ఆకులు హిమాలయ పర్వతాల్లో, దక్షిణ భారతదేశ తీరాల్లో గుర్తించారు. విటమిన్కె కు తిరుగులేని ఆధారం. బి6, ఫోలేట్, విటమిన్ఎ పుష్కలం.
బిచు బూటి ఇది హిమాలయ పర్వత ప్రాంతాల్లో కనిపిస్తుంది. చర్మం, ఎముకలు, మూత్రనాళ వ్యాధులను పోగొట్టేది.
*కుల్పాసాగ్
(పీగ్ వీడ్) ఒమేగా౩ ఫ్యాటీ యాసిడ్స్ మిగతా కూరగాయలన్నింటికంటే ఎక్కువగా లభిస్తాయి.
*సుష్ని సాగ్
ఈ ఆకులో ఔషధగుణాలు అత్యధికం. నిద్రలేమి, హైపర్టెన్షన్, డయేరియా వంటి వ్యాధులకు చర్మవ్యాధుల నియంత్రణకు ఉపకరిస్తుంది