చైనా యుద్ద నౌక

SMTV Desk 2017-06-29 16:03:38  china, war, tesea

బీజింగ్, జూన్ 29 : చైనా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నౌకా దళాన్ని రూపొందించుకునే ఆలోచనలో ఉంది. నూతన తరానికి చెందిన అత్యాధునిక యుద్ధనౌక రూపకల్పనలో మరో ముందడుగు వేసింది చైనా... విధ్వంసక వ్యవస్థలను ఏకకాలంలో అధిక సంఖ్యలో తీసుకెళ్లగల భారీ యుద్ధ నౌకను అనగా గగనతల రక్షణ, క్షిపణి నిరోధక, జలాంతర్గాములు, యుద్ధ నౌకలను దేశీయంగా రూపొందించింది. ఈ యుద్ధనౌక ఆయుధసంపత్తిని నింపుకున్న తరువాత 12వేల టన్నులకు పైగా బరువు బరువు ఉంటుందని అలాగే ఇది టైప్055 గా వ్యవహరించారు. ఈ యుద్ధనౌక షాంగైలోని జియాన్యాన్ నౌకా నిర్మాణ కేంద్రంలో బుధవారం ప్రారంభించినట్లు అధికార వార్తా సంస్థ షిన్హువా ప్రకటించింది. చైనా నౌకాదళ చరిత్రలో ఇదో మైలురాయిగా నిలిచిపోయింది. టైప్055 తరహాని మొత్తం నాలుగు యుద్ధనౌకలను తయారు చేయాలన్నది చైనా యొక్క ముఖ్య లక్ష్యం. అందులో ఇది మొట్టమొదటిది. ఈ కొత్తరకం యుద్ధనౌక హిందూ మహాసముద్రంలో భారత్, అమెరికాలను సంయుక్తంగా కలుపదానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 2019లో ఈ యుద్ధనౌక యొక్క సేవలు పూర్తిగా వినియోగంలోకి రానున్నాయి. అలాగే భారత్ ఒకేసారి 122 క్షిపణులను మోయగల విధ్వంసక యుద్ధనౌకను తయారుచేస్తుందని సమాచారం. అలాగే ఇది విశాఖపట్నంలోని "15బి" కన్నా చాలా పెద్దది అని అంటున్నారు.