పోలీసుల కంటే ముందే ట్విట్టర్ లో

SMTV Desk 2017-06-28 12:33:11  twitter, followers, information, police

లండన్, జూన్ 28 : సోషల్ మీడియా వాడకం ఎక్కువైన నేపథ్యంలో ప్రతి ఒక సంఘటన చర్చనీయాంశం అయ్యింది. సామజిక మాధ్యమాలే వేదికగా జరిగిన ఏ ఘటన అయిన సరే అది పోలీసుల కంటే ముందే ప్రజలకి చేరుతుంది. దీనికి ట్విట్టర్ వేదికగా నిలిచిందని సర్వేలో వెల్లడైంది. బ్రిటన్ లోని కార్డిఫ్ వర్సిటిలో ఒక అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు వెలుగులోకి తెచ్చారు. 2011 లో ఘర్షణల సమయంలో ఎక్కువగా నెటిజన్ లు ట్విట్టర్ లో పోస్టు చేయడం వలన పోలీసుల కంటే ముందే ఈ సమాచారం వెలుగులోకి వచ్చాయి. ట్విట్టర్ ను ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఎక్కడ ఏం జరిగిన ముందుగా పోస్టు చేస్తున్నారు. దీనితో ప్రస్తుతం ఈ ట్విట్ ఎవరు పంపిస్తున్నారు. ఎక్కడి నుంచి పంపిస్తున్నారు అని తెలుసుకునే పరిజ్ఞానాన్ని అభివృద్ది చేసారు. అంతే కాకుండా మనిషి పంపించిన దగ్గర ఘర్షణల తీవ్రత ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కూడా తాజా పరిజ్ఞానం వీలుగా ఉంటుందని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న పిటో బర్నప్ వివరించారు.