మాది అన్నాచెల్లెల బంధం : కమల్‌హాసన్‌

SMTV Desk 2018-03-02 12:06:32  kamal hassan, mnm leader, sridevi, actress

చెన్నై, మార్చి 2 : ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్‌హాసన్‌ తాను, శ్రీదేవి.. అన్నాచెల్లెలు వంటివారమని తెలిపారు. ఆయన ఓ వారపత్రికకు రాసిన కాలమ్‌లో ఈ మేరకు పేర్కొన్నారు. తొలి మూడు సినిమాలప్పుడు‘హయ్యా.. మళ్లీ శ్రీదేవి జంటనా?’ అనే పరిస్థితిలో ఉండేవాడినని వ్యాఖ్యానించారు. తమది హిట్‌పెయిర్‌ కావడంతో మొదట సంప్రదించకుండానే సినిమాల్లో జోడీగా ఖరారు చేయడం ప్రారంభించారని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.