నయనాలు అదిరాయి.. బన్ని గుండెలు చెదిరాయి..

SMTV Desk 2018-02-13 13:57:23  priya prakash warrior, allu arjun, malayali movie, oru adhar love.

హైదరాబాద్, ఫిబ్రవరి 13 : తన చూపుతో కుర్రకారు గుండెల్ని పిండేసిన మలయాళీ భామ.. తన కళ్లతో పలికించిన భావాలు వర్ణించలేనివి. ఆమె ప్రియ ప్రకాశ్‌ వారియర్‌.. ఆమె కథానాయికగా నటిస్తున్న "ఒరు అదర్‌ లవ్‌" చిత్రంలోని "మాణిక్య మలరాయ" అనే పాటను ఇప్పటివరకు 45 లక్షల మందికి పైగా వీక్షించారు. కేవలం 27 సెకన్లలోనే సోషల్‌మీడియాలో సంచలనం సృష్టించిన హీరోయిన్ ప్రియకు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫిదా అయిపోయారు. ఈ వీడియోను స్వయంగా బన్ని తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసి.. "నేను చూసిన క్యూట్‌ వీడియోల్లో ఇదొకటి. ది పవర్‌ ఆఫ్‌ సింప్లిసిటీ. లవ్‌ ఇట్‌" అంటూ ట్వీట్‌ చేశారు. ప్రియ పలికించిన హావభావాలు.. రెండు రోజుల నుండి యూట్యూబ్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ లలో మొదటి స్థానంలో ట్రెండ్‌ అవుతున్నాయి. అనుకోని విధంగా వస్తున్న ఈ స్పందనకు ప్రియ తబ్బిబ్బవుతోంది.