తుదిశ్వాస విడిచిన పాక్ ఉద్యమకారిణి..

SMTV Desk 2018-02-12 11:12:43  asma jahangir, passed way, human rights activist, pakistan

లాహోర్‌, ఫిబ్రవరి 12 : పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, మానవ హక్కుల ఉద్యమకారిణి ఆస్మా జహంగీర్‌(66) తుదిశ్వాస విడిచారు. ఆదివారం తెల్లవారుజామున ఆమె గుండెపోటు కారణంగా మృతి చెందారు. 1952లో లాహోర్‌లో జన్మించిన అస్మా, పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుంచి 1978లో ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. పాకిస్తాన్‌ సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌కు తొలి అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన అస్మా.. శక్తిమంతమైన ఆర్మీ, నిఘా సంస్థ ఐఎస్‌ఐల వ్యవహారశైలిని తీవ్రంగా విమర్శించేవారు. మానవహక్కుల రంగంలో చేసిన కృషికి గానూ 2014లో రైట్‌ లైవ్లీహుడ్‌ అవార్డు, 2010లో ఫ్రీడమ్‌ అవార్డు, హిలాల్‌ ఏ ఇంతియాజ్‌ అవార్డులను అందుకున్నారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.