ట్రంప్ తో నాకు అఫైర్‌ లేదు : నిక్కీహేలీ

SMTV Desk 2018-01-27 12:50:56  trump, affair, nikkey heli, uno, Fire and Fury

వాషింగ్టన్‌, జనవరి 26: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో తనకు అఫైర్‌ ఉందని వచ్చిన వదంతుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీహేలీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్రంప్‌తో అఫైర్‌ అని వ్యాఖ్యలు చేయడం చాలా అసహ్యంగా ఉందని అన్నారు. మైకేల్‌ ఊల్ఫ్‌ రాసిన ‘ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ’ పుస్తకంలో ట్రంప్‌తో నిక్కీకి అఫైర్‌ ఉందని రాయడంతో ఒక్క సారిగా ఈ వదంతులు గుప్పుమన్నాయి. ట్రంప్‌తో ప్రెసిడెన్షియల్‌ విమానంలో, ఓవల్‌ కార్యాలయంలో నిక్కీ చాలా సేపు ఒంటరిగా గడిపారని ఊల్ఫ్‌ పుస్తకంలో రాశారు. దీనిపై స్పందించిన హేలీ తానెప్పుడూ అధ్యక్షుడు ట్రంప్‌తో తన భవిష్యత్‌ గురించి చర్చించలేదనీ, ఆయనతో ఒంటరిగా గడపలేదని వెల్లడించారు.