ఆదిలోనే "జీఎస్టీ" కి అంతరాయం..!

SMTV Desk 2018-01-26 14:51:32  ram gopal varma, god sex and truth, web sires,

హైదరాబాద్, జనవరి 26 : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా "జీఎస్టీ" వెబ్ సిరీస్ విడుదలకు ఆదిలోనే అడ్డంకి ఏర్పడింది. ఉదయం 9 గంటలకు జీఎస్టీని విడుదల చేయనున్నట్లు వర్మ ప్రకటించడంతో అభిమానుల౦తా నెట్ లో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో వర్మ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ.. జీఎస్టీని అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోతున్నానని ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్ అప్ లోడ్ చేయడానికి కొంత సమయం పడుతుందని, అప్‌డేట్ చేసిన తర్వాత వెల్లడిస్తానని వర్మ వెల్లడించారు. మరోవైపు ఈ వెబ్ సిరీస్ ను నిలిపి వేయండ౦టూ పలు మహిళా సంఘాలు నిరసనలు తెలుపుతూ పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేశాయి. ఇదిలా ఉండగా నిజంగానే వర్మ జీఎస్టీని విడుదల చేయాలనుకున్నారా.? లేదంటే మహిళా సంఘాల హెచ్చరికలకు వెనక్కు తగ్గారా.? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.