బాలసముద్రం, జనవరి 13: ఒకవైపు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మరోవైపు షోరూమ్ ఓపెనింగ్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. నిన్న హన్మకొండ పట్టణంలోని నక్కలగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్, డైమండ్ షోరూంను ఆయన ప్రారంభించారు. అనంతరం తొలి కస్టమర్లకు ఆభరణాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవరకొండ మాట్లాడుతూ.. తన సోదరుడు వరంగల్ అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాడని, తాను కూడా వరంగల్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అన్నారు. సినిమా డైలాగ్‌లు చెబుతూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతూ సందడి చేశారు. తన అభిమాన నటుడిని చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.