హైదరాబాద్, జనవరి 10: టాలీవుడ్ మన్మధుడు నాగార్జున-నాని కలయికలో ఓ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వహించనున్న ఈ సినిమాలో నాగార్జున డాన్ పాత్రలో.. నాని డాక్టర్ గా కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో నాని సరసన నటించేదుకు రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. నానితో జత కట్టేందుకు ఈ సుందరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సినీ వర్గాల్లో టాక్. దీనికి సంబంధి౦చి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.