నేను చాలా స్మార్ట్ : ట్రంప్

SMTV Desk 2018-01-09 11:52:30  trump, mental fitness, health issue, medical treatment.

వాషింగ్టన్, జనవరి 9 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు ఈ వారంలో వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కాని ఆయన మానసిక పరిస్థితిని పరీక్షించట్లేదని అధ్యక్ష నివాసం వైట్‌హౌస్‌ వెల్లడించింది. ఆయన ఆరోగ్య స్థితికి సంబంధించి అనేక ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ విషయంపై అధికార ప్రతినిధి హోగాన్‌ గిడ్లే స్పందించారు. అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానంగా "నో" అంటూ తెలిపారు. ట్రంప్ కు వాషింగ్టన్‌లోని వాల్టర్‌‌ రీడ్‌ మిలిటరీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరగనున్నాయి. ఇటీవల కొందరు ఆయన మానసిక స్థితిపై పలు అనుమానాలు వ్యక్తంచేశారు. ఈ క్రమంలో "నేను తెలివైన వ్యక్తిని, అలాగే చాలా స్మార్ట్‌ కూడా" అంటూ తన ట్విటర్‌లో పేర్కొనడం విశేషం.