లేట్ అయిన లేటెస్ట్ గా వచ్చిన ‘అజ్ఞాతవాసి’ ట్రైలర్

SMTV Desk 2018-01-07 08:59:07  Power Star Pawan kalyan, Agnyathavasi Trailer, ANirudh Ravi chander

హైదరాబాద్, జనవరి 7 : ఉత్కంఠ కు తెర పడింది...పవన్ అభిమానుల ఆశ తీరింది.. ఎంతో ఆత్రుతగా వేచి చూసిన ‘అజ్ఞాత వాసి’ ట్రైలర్ అజ్ఞాతం వీడి బయటకు వచ్చింది. టీజర్ పై కొంత మంది ‘అత్తారింటికి దారేది’ లానే ఉందని కామెంట్ చేశారు. కానీ ట్రైలర్ ఆద్యంతం తివిక్రమ్ ట్రేడ్ మార్క్, పవర్ స్టార్ పవర్ ఫుల్ యాక్షన్ మేళవించి లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా ట్రెండ్ సెట్టర్ గా ఉంది. దీంతో సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ట్రైలర్ ఆరంభంలో పవన్ ‘ఇది మనం కూర్చునే కుర్చీ.. పచ్చటి చెట్టుని గొడ్డలితో పడగొట్టి.. రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి.. బెరడును బ్లేడుతో సానబెట్టి.. ఒళ్లంతా మేకులతో కొట్టి కొట్టి తయారు చేస్తారు. ఎంత హింస దాగి ఉందో కదా.. జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనుకా ఓ మినీ యుద్ధమే ఉంటుంది’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన తీరు ప్రేక్షుకులను ఉర్రూతలూగిస్తుంది. ముఖ్యంగా ట్రైలర్ లో యువ సంగీత కెరటం అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్(బీజీఎం), మణికందన్ చిత్రీకరణ హైలైట్ గా ఉన్నాయి. ఈ ట్రైలర్ ప్రస్తుతం అంతర్జాలంలో ట్రేండింగ్ గా దూసుకుపోతుంది. సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్‌లు హీరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రంతో ఖుష్భూ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీని విడుదల కాబోతుంది.