అది పినిశెట్టి న్యూ మూవీకి ముహూర్తం ఖరారు...

SMTV Desk 2018-01-06 13:07:12  aadhi, tapsi, kona venkat,

హైదరాబాద్, జనవరి 6: వెండితెరపై ఒకవైపు హీరోగా, మరోవైపు విలన్ గా నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అది పినిశెట్టి. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో ప్రతి నాయకుడిగా అలరించిన అది, హీరో పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నాడు. కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరనాథ్ దర్శకత్వం వహించనున్నాడు. అదికి జోడిగా తాప్సి, రితికా సింగ్ నటించనున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగును ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. మళ్ళీ చాలా రోజుల తరువాత హీరోగా నటిస్తున్న ఆదికి ఈ చిత్రం ఎంత హిట్ తెచ్చిపెడుతుందో చూడాలి మరి.