ప్రియాంక చోప్రా పేరుతో పుస్తకం...

SMTV Desk 2018-01-05 17:48:30  priyanka chopra, aseem chaabra,

ముంబాయి, జనవరి 5: ప్రముఖ నటి, బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రా జీవిత కథను ఆధారంగా తీసుకోని ఓ పుస్తకాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ పుస్తకానికి సృష్టికర్త ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ జ‌ర్న‌లిస్ట్ అసీం చాబ్రా. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "ప్రియాంక జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను రాస్తాను. ఒక చిన్న పట్టణం నుండి వచ్చి అంతార్జాతీయ స్థాయిలో ఎదిగిన అంశాలను వివరిస్తాను. అంతేకానీ ప్రియాంక వ్యక్తిగత జీవితం గురించి రాయను" అని తెలిపారు.