ఇద్దరి పిల్లలకు అమ్మగా..!

SMTV Desk 2018-01-04 11:30:18  kajal aggarwal, venkatesh, teja,

హైదరాబాద్, జనవరి 4: తన అందంతో, నటనతో అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది కాజల్ అగర్వాల్. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలలో కనిపించిన ఈ సుందరి, ఇప్పుడు ఇద్దరి పిల్లల తల్లిగా కనిపించబోతుందట. తేజ దర్శకత్వంలో వెంకటేష్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతు౦ది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ను కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం. ఇందులో కాజల్ ఇద్దరి పిల్లలకు అమ్మగా నటిస్తుందట. ఇది వరకు ఎన్నడు చేయని సాహసం కాజల్ చేయబోతుందని సినీ వర్గాల్లో టాక్. అయితే ఈ ముద్దుగుమ్మ ఎంతవరకు ఈ పాత్రలో మెప్పిస్తుందో చూడాలి మరి.