న్యూ ఇయర్ గిఫ్ట్ “కొడకా కోటేశ్వరరావు” వచ్చేసింది...

SMTV Desk 2017-12-31 18:45:07  POWER STAR, SONG, AGNATHA VASI, #KodakaaKoteswarRaoSong

హైదరాబాద్, డిసెంబర్ 31 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఈ పేరు ప్రస్తుత తెలుగు సినీ చరిత్రలో ట్రెండ్ సెట్టర్.. భారీ అభిమానగణం అతని సొంతం.. హీరోగా, అతను నటించే సినిమాల్లో తన గాత్రంతో ప్రేక్షకులను అలరించే పవర్ స్టార్ ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్ ‘అజ్ఞాత వాసి’ లో కూడా తన స్వరాన్ని వినిపించారు. ఇంతక ముందు ఈ నెల 31న నూతన సంవత్సర గిఫ్ట్ ఇస్తామన్న చిత్ర బృందం “కొడకా కోటేశ్వరరావు” పాటను విడుదల చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్నాఈ చిత్రంలో “కొడకా కోటేశ్వరరావు” పాట అందరి అంచనాలకు మించి ఉంది. పవన్ మొదట్లో ‘బాబూ తుకారం ఒక గ్లాసు మిరియాల పాలు.. ఖర్చు అనుకోకపోతే రెండు యాలక్కాయలు కూడా తగిలించవోయ్‌ కుమ్మేద్దాం.. కోడకా కోటేశ్వరరావా..శర్మగారు నేను ఎమి పాడుతున్నాను. మీరేమి వినిపిస్తున్నారు..’ అంటూ తన దైన శైలిలో హుషారుగా మొదలైన ఈ పాట అభిమానులను తెగ అలరిస్తుంది. కీర్తిసురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంకు అనిరుధ్‌ తన బాణీలను తొలిసారి అందించారు. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది.కాగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ధియేటర్లలో సందడి చేయనుంది.