ఈ ఏడాదిలో పెద్ద చిత్రాలతో పాటు చిన్న చిత్రాలకు ప్రాధాన్యం...

SMTV Desk 2017-12-31 15:31:55  Telugu film industry Priority to small films

హైదరాబాద్, డిసెంబర్ 31 : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ ఏడాది మొత్తంలో 180కి పైగా సినిమాలు తెరకెక్కించడం జరిగింది. అందులో 45 నుంచి 55 చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలు, దర్శకనిర్మాతలు తీసిన సినిమాలు ఉండగా, మిగితా చిత్రాలన్నీ పరిశ్రమకు నూతనంగా పరిచయమై తీసినవే, తెరకెక్కించడం జరిగింది. స్టార్‌ హీరోల చిత్రాలు విడుదల కానీ సమయంలో, చిన్న సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండేవి. ఇలా ఈ ఏడాదిలో పెద్ద చిత్రాలతో పాటు, చిన్న చిత్రాలపై కూడా ప్రేక్షకులు ఆదరణ చూపించడం జరిగింది.