‘అ!’ నుంచి మరో పోస్టర్...

SMTV Desk 2017-12-27 16:34:18  awe movie updates, muralisharma awe poster, nani movie, #AWE

హైదరాబాద్, డిసెంబర్ 27 : న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా పతాకంపై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆ!’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ఒక్కొక్కరి పాత్రను పరిచయం చేస్తూ వారి ఫోటోలతో కూడిన పోస్టర్లను విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు నిత్యామీనన్, అవసరాల శ్రీనివాస్, ఇషారెబ్బ, రెజినా కసాంద్రా లతో పాటు ఓ చేపకు వాయిస్ ఓవర్ ఇస్తున్న నాని పోస్టర్ ను విడుదల చేశారు. అయితే ఇప్పుడు మురళీశర్మ పాత్రను పరిచయం చేస్తూ మరో పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు. ఈ ప్రచార చిత్రంలో ఆయన ఇంద్రజాలికుడిగా కనిపిస్తున్నారు. అంతేకాదు ‘ఐ యామ్‌ ది గ్రేటెస్ట్‌’ అనే ట్యాగ్‌లైన్‌ను పెట్టారు. ఇంకా కాజల్‌, ప్రియదర్శి, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్‌ లతో పాటు మరికొందరు ఈ సినిమాలో నటిస్తుండగా వారి పోస్టర్లు విడుదలపై ఆసక్తి నెలకొంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రంలో చేపతో పాటు ఓ మొక్క కూడా ఇందులో కనిపించనుంది. దానికి రవితేజ వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.