అభిమాని మరణంతో కన్నీటి పర్యంతమైన కార్తీ

SMTV Desk 2017-12-27 16:18:58  karthi, fan passed away, crying, jeevan kumar

చెన్నై, డిసెంబర్ 27 : తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా, తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో కార్తీ. సూర్య తమ్ముడిగా తెలుగు తెరకు పరిచయమైనా కార్తీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా అభిమానులను అప్పుడప్పుడు కలిసి వారికి సహయం చేస్తూ ఉంటాడు. తాజాగా తిరుమన్నామలై కార్తీ ఫ్యాన్స్ అసోషియేషన్ కార్యదర్వి జీవన్ కుమార్ కారు ప్రమాదంలో మృతి చెందారు. అతని మరణ వార్త విని అక్కడికి వచ్చిన కార్తీ ఉద్వేగం ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ఇంతక ముందు కార్తీ మూడు నెలల కిందట జీవన్ కుమార్ వివాహ వేడుకకు కూడా కార్తీ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఊహించని ఈ ఘటన పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవన్ కుమార్ మరణం తనకు తీరని లోటని ఆయన మరణంతో పెద్ద దిక్కు కోల్పోయిన ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాను అని కార్తీ ఈ సందర్భంగా వెల్లడించారు.