యుకె టైర్‌-2 వీసా మరింత సులభతరం...

SMTV Desk 2017-12-27 15:16:43  work visa, Britain, London tyre-2 visa.

లండన్, డిసెంబర్ 27: బ్రిటన్‌లో చదువుకుంటున్న ఇతర దేశాల విద్యార్థుల కోసం అక్కడి ప్రభుత్వం వర్క్ వీసాను పొందేందుకు నిబంధనలను మరింత సులభతరం చేసింది. చదువు పూర్తైన వెంటనే విద్యార్థులు వర్క్‌ వీసాను పొందవచ్చు. జనవరి 11 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని అక్కడి అధికారులు తెలిపారు. చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు టైర్‌-2 వీసా(వర్క్‌ వీసా)కు దరఖాస్తు చేసుకోవాలంటే వారి చదువు పూర్తైనా... డిగ్రీ వచ్చేంతవరకు వేచి ఉండే నిబంధనలను సడలిస్తూ... డిగ్రీతో సంబంధం లేకుండా చదువు ముగిసిన అనంతరం వీసాకు దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించారు.