ప్రపంచంలోనే అతి చిన్న మొబైల్‌…

SMTV Desk 2017-12-24 17:25:26  smallest mobile, janco, tiny t1 mobile.

లండన్, డిసెంబర్ 24: యుకె కు చెందిన జాన్ కో అనే సంస్థ ప్రపంచంలోనే అతిచిన్న మొబైల్ ఫోన్ ను తయారు చేసింది. దీని పేరు టిని టి1 గా ప్రవేశపెట్టిన ఈ మొబైల్ దాదాపు చూపుడు వేలికన్నా కొంచెం పెద్దగా ఉంటుందని వారు వెల్లడించారు. సాధారణ ఫోన్ లా పనిచేసి దీనిలో కాల్స్, మెసేజ్ లు చేసుకోవచ్చు. ఇందులో ౩౦౦ వరకు ఫోన్ నెంబర్లు, 50 వరకు టెక్స్ట్ మేసేజ్ లు నిలువ చేసుకోవచ్చు. 0.49 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్, 32 ఎంబి ర్యాం, 32ఎంబి అంతర్గత మెమరీ కలదు. 200 ఏంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో, 2018 మే నుంచి రూ. 2.280 లకే అన్ని దేశాల్లో అందుబాటులోకి రానుంది.