‘న్యూ ఎంట్రీ బేబీగర్ల్‌’ అంటూ షేర్ చేసిన శ్రీనివాస్‌రెడ్డి

SMTV Desk 2017-12-23 16:50:56  Comedian Srinivas Reddy, Srinivasa Reddy blessed with a baby girl

హైదరాబాద్, డిసెంబర్ 23 : హాస్యనటుడు శ్రీనివాస్‌రెడ్డి ‘న్యూ ఎంట్రీ.. బేబీ గర్ల్‌’ అంటూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఇంతకీ ఆ ఫోటో లో ఉన్నది ఎవరో తెలుసా? శ్రీనివాస్‌రెడ్డి సతీమణి ఇటీవల పాపకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోను శ్రీనివాస్‌రెడ్డి ‘న్యూ ఎంట్రీ.. బేబీ గర్ల్‌’ అంటూ అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ‘ఆనందో బ్రహ్మ’, ‘రాజా ది గ్రేట్‌’, ‘బాలకృష్ణుడు’ తదితర చిత్రాల్లో నవ్వులు పూయించిన ఆయన తనదైన టైమింగ్‌తో వినోదాన్ని పంచే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పలువురు రచయితలు, దర్శకులు ఆయనను దృష్టిలో పెట్టుకుని సరికొత్త పాత్రలను సృష్టిస్తుంటారు.