కోన వెంకట్‌ స్క్రిప్ట్‌ తో కండల వీరుడు...

SMTV Desk 2017-12-22 16:19:14  salmankhan, konavenkat Script, movie, mumbai

ముంబయి, డిసెంబర్ 22 : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ టాలీవుడ్ రచయిత రాసిన ‘షేర్‌ ఖాన్‌’ చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమాకు రచయిత కోన వెంకట్‌ స్క్రిప్ట్‌ రాసినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. చాలా కాలం క్రితమే ‘షేర్‌ ఖాన్‌’ స్క్రిప్ట్‌ను కొనుక్కున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సల్మాన్‌ సోదరుడు సొహైల్‌ ఖాన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. తెలుగులో 2008లో వచ్చిన ‘రెడీ’ చిత్రానికి కోన వెంకట్‌ కథ రాశారు. ఈ సినిమాని హిందీలో అదే టైటిల్‌తో తెరకెక్కించారు. ఇందులో రామ్‌ పాత్రలో సల్మాన్‌ ఖాన్‌, జెనీలియా పాత్రలో అసిన్‌ నటించారు. ఇవి కాకుండా సల్మాన్‌.. ‘రేస్‌ 3’, ‘భారత్‌’, వంటి పలు చిత్రాల్లో నటించనున్నారు. కాగా, సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన ‘టైగర్‌ జిందా హై’ నేడు విడుదలైంది. మరీ ఈ సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయాలు తెలియాల్సి ఉంది.