పొడవైన దుస్తులు సృష్టించి ఫ్రాన్స్‌ కంపెనీ గిన్నిస్‌ రికార్డు!

SMTV Desk 2017-12-19 13:04:45  long dress, guinnis record, france company, bride, 8095

లండన్‌, డిసెంబర్ 19: 8095 మీటర్ల పొడవైన వధువు దుస్తులు తయారుచేసి ఫ్రాన్స్‌కు చెందిన డైనమిక్‌ ప్రాజెక్ట్స్‌ అనే కంపెనీ గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. లండన్ లో ఇంత భారీ పొడవు ఉన్న దుస్తులను వధువు ధరించగా సహాయకులు చివరికొన వరకు పట్టుకొని ప్రదర్శించారు. దీన్ని కుట్టడానికి 15 మంది స్వచ్ఛంద సేవకులు సహకరించారు. అధికారికంగా రికార్డు ధృవీకరించిన తరువాత దీన్ని ముక్కలు చేసి అమ్మేశారు. అమ్మగా వచ్చిన ధనాన్ని అనాథాశ్రమాలకు విరాళంగా అందజేశారు. కాగా గిన్నిస్ రికార్డులకెక్కిన ఈ దుస్తులను ధరించిన వధువు అమితానంద౦లో మునిగితేలింది.