అలా నేర్చుకున్నవి చాలా ఉన్నాయి : తమన్నా

SMTV Desk 2017-12-17 13:36:37  tamanna bhatia, hyderabad, bahubali avanthika.

హైదరాబాద్, డిసెంబర్ 17 : బాహుబలి లో అవంతిక గా కనిపించిన తమన్నా ఏ రంగంలోనైనా ఎంత ఎదిగినా ఇంకా నేర్చుకోవడానికి మిగిలే ఉంటుందని అన్నారు. దాదాపు పది సంవత్సరాలుగా తెలుగు చిత్రసీమలో కొనసాగుతు, సీనియర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ‘వృత్తికి సంబంధించి పరిణతితో ఆలోచిస్తూ... నేను పక్కాగా నేర్చుకొంటున్న అసలు సిసలు సమయమిదే’’ అంటోంది. నాకు తెలియని విషయాన్ని తెలియదనే చెబుతా. అందులో మొహమాటం ఏమీ లేదంటూ చెప్పుకొచ్చింది. మనకు ఇది రాదు అని ఓసారి అనుకొంటే కచ్చితంగా చాలా విషయాలు తెలిసొస్తాయి. ఈ రకంగా నేను చాల విషయాలు నేర్చుకున్న అని తమన్నా సెలవిచ్చారు. ఇక తాజాగా తమన్నా ‘క్వీన్‌’ సినిమాతో పాటు, కల్యాణ్‌రామ్‌తో మరో చిత్రంలో నటిస్తున్నారు.