త్వరలో ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్‌

SMTV Desk 2017-12-16 18:12:01  facebook, new Feature cumming soon, newyark

న్యూయార్క్, డిసెంబర్ 16 : మీ ఫేస్‌బుక్‌ లో అధిక సంఖ్యలో నోటిఫికేషన్లు వస్తున్నాయా...వాటితో మీరు విసుగు చేదుతున్నారా? ఈ ఇబ్బందిని తొలగించడానికి ఫేస్‌బుక్‌ సంస్థ ఓ సరికొత్త ఆలోచనతో త్వరలో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదేంటంటే...వ్యక్తులు, కమ్యూనిటీల నుంచి వచ్చే నోటిఫికేషన్లను మీరు కొద్దికాలం పాటు రాకుండా అడ్డుకునే ఆప్షన్‌ను అందించనుంది. ఇందుకోసం ‘స్నూజ్‌’అనే పేరుతో ఈ ఆప్షన్‌ తీసుకురానున్నట్లు సోషల్‌మీడియా దిగ్గజం వెల్లడించింది. దీని ద్వారా సమాచార నియంత్రణకు అవకాశం లభిస్తుంది. ఫేస్‌బుక్‌ ఖాతాలో ‘స్నూజ్‌’ ఆప్షన్‌ను కుడివైపు పైన ఉన్న డ్రాప్‌డౌన్‌లో ఇవ్వనున్నారు. దానిని ఎంచుకోవడం ద్వారా వ్యక్తులు, పేజీలు, గ్రూప్‌ల నుంచి ప్రవాహంలా వచ్చి పడుతున్న నోటిఫికేషన్లను 30 రోజుల పాటు నియంత్రించవచ్చు. గత రెండు నెలలుగా ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు. ‘స్నూజ్‌’ కాలపరిమితి అయిపోయిన తర్వాత దాన్ని కొనసాగించాలా? వద్దా? అనేది నోటిఫికేషన్‌ వస్తుంది. దాన్ని బట్టి ఫేస్‌బుక్‌ ఖాతాదారుడు ఏ నిర్ణయం తీసుకోవాలో నిర్ణయించవచ్చు.