5 నిమిషాలకి 5 కోట్ల పారితోషికం...!

SMTV Desk 2017-12-16 14:46:22  priyanka chopra, zee tv,

ముంబాయి, డిసెంబర్ 16: నటనతో, అందంతో, తనదైన శైలి అందరినీ అలరిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పేరొంది౦ది బాలీవుడ్ బ్యూటి ప్రియాంక చోప్రా. బాలీవుడ్ లో అగ్ర కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక, ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలు, టీవీ సీరీస్ లతో బిజీ బిజీగా ఉంది. అయితే అసలు విషయం ఏంటంటే... ఈ బిజీ షెడ్యుల్లో రెండేళ్ల తరువాత ఓ బాలీవుడ్ వేడుకలో ప్రియాంక సందండి చేయనుందని సమాచారం. అంతేకాదు ఈ నెల 19న జీ సినీ అవార్డ్స్ కార్యక్రమంలో డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చేందుకు అంగీకరించిందని, దీనికి గాను ఏకంగా 5 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ కారణంగా అంత పారితోషికం ఇచ్చేందుకు జీ మీడియా ముందుకొచ్చిందట. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో చూడాలి మరి.