పవన్ పై ప్రశంసల జల్లు కురిపించిన వర్మ

SMTV Desk 2017-12-15 21:35:21  pawan kalyan, ram gopal varma, post, director, tolly wood

హైదరాబాద్, డిసెంబర్ 15 : టాలీవుడ్ టాప్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. అంతే కాకుండా పవర్ స్టార్ ఓ గొప్ప నాయకుడు అవుతారని చెప్పారు. ఆయన ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు. " పవన్ కళ్యాణ్ కొత్త ప్రసంగం ఇప్పుడే చూశాను. ఆయనకు వివిధ అంశాలపై ఉన్న అవగాహన చూసి ఆశ్చర్యానికి లోనయ్యాను. అంతే కాకుండా ఇతరులపై తన అభిప్రాయాల్ని, ఆలోచనల్ని పంచుకోవడానికి, వారి పేర్లను నేరుగా ప్రస్తావించడానికి ఆయన ఇబ్బంది పడలేదు. పవన్ ఏదైనా మాట్లాడే ముందు అన్ని విషయాలు ఆలోచించుకుని మాట్లాడే విధానం బాగుంది. నాకు ఓ చెడు లక్షణం ఉంది. అదేంటంటే ఆలోచించకుండా హఠాత్తుగా మాట్లాడి, ఎలాంటి ఆలోచన లేకుండా ట్వీట్‌ చేస్తుంటా. పవన్ ప్రసంగం విన్నాక నాకు కనువిప్పు కలిగింది. ఈ నేపథ్యంలో ఆయనకు నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన ఓ గొప్ప నాయకుడు అవుతారు." అని వెల్లడించారు.