టైర్లతో కాంక్రీటు

SMTV Desk 2017-06-16 16:53:49  Concreet,Cement,Roads,UBC

లండన్, జూన్ 16: ఏ వస్తువుతోనైనా కాంక్రీటు తయారు చేయవచ్చు. పర్యావరణ హితానికి ఉపయోగపడేలా పారేసిన పాత టైర్ల ముక్కలతోనూ ధృడమైన కాంక్రీటు తయారు చేయవచ్చని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా (యూబీసీ) పరిశోధకులు నిరూపించారు. అంటే ఇకపై పాత టైర్లను గుంతలు పూడ్చడానికి బదులు భవనాలు, రోడ్లు, వంతెనల వంటివి నిర్మించుకోవడానికి వాడుకోవచ్చని చెప్పారు. నిజానికి పాత టైర్లను గుంతలు పూడ్చడానికి బదులు భవనాలు, రోడ్లు, వంతెనల వంటివి నిర్మించడం కొత్త విషయమేమి కాదు. కానీ టైర్లలోని పాలిమర్ పోచలతో కాంక్రీటు తయారు చేయడమే సరికొత్త విషయం. సిమెంట్, ఇసుక, నీళ్ళతో పాటు 0.35% పాలిమర్ పోచలను కలిపి కొత్తరకం కాంక్రీటు మిశ్రమాన్ని రూపొందించటం గమనార్హం. ఇది దృడంగా ఉండటమే కాదు. కాంక్రీటు లో తల్లెతే పగుళ్ళనూ 90 శాతానికి పైగా నివారిస్తున్నట్లు తమ పరీక్షలో తేలిందని యూబీసీ పరిశోధక విద్యార్థి ఒబినా ఒనువాగులుచి తెలిపారు. ఒక్కో టైరు నుంచి ఒక కిలో పాలిమర్ పోచలను తీయొచ్చని వివరించారు.