తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం

SMTV Desk 2017-12-11 12:37:29  comedian vijay sai suicide, tolly wood, yusaf guda, hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 11 : తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక హాస్య నటుడు విజయ్ సాయి యూసఫ్ గూడ లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు, ఒకరికొకరు, బొమ్మరిల్లు, మంత్ర, బృందావనం, బెట్టింగ్ బంగార్రాజు తదితర సినిమాల్లో నటించారు. చాలా రోజుల నుండి సినిమా అవకాశాలు తగ్గిపోవడం, చేతిలో పనిలేక పూట గడవని స్థితిలోనే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. విజయ్ మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న ఇందిరానగర్, కృష్ణనగర్, యూసుఫ్ గూడ ప్రాంతాల్లోని పలువురు జూనియర్ ఆర్టిస్టులు, ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.