యూట్యూబ్ ఛానల్ ద్వారా 106 కోట్లు సంపాదించాడు...

SMTV Desk 2017-12-09 20:15:46  youtube channel dantdm, Dan Milton, Forbes magazine.

న్యూయార్క్, డిసెంబర్ 09: సామాజిక మాధ్యమాల ద్వారా డబ్బులు సంపాదిస్తుంటారు అని మనం వింటూనే ఉన్నాం... కానీ ఏకంగా ఏడాదికి 106 కోట్లు సంపాదించి, ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో చోటు దక్కించుకున్నాడు సూపర్ మార్కెట్ మాజీ ఉద్యోగి డాన్ మిడిల్టన్. యూట్యూబ్ సంపాదనలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిన మిడిల్టన్, తన ఛానల్ లో వీడియో గేములు ఆడడమే కాకుండా అందులోని మెళకువలను కూడా తెలుపుతూ ఉండే వీడియో పోస్టు చేసేవాడు. 1.70 కోట్ల సబ్ స్క్రిబర్స్ ఉన్న తన “డాన్ టిడిఏం” ఛానల్ తో సరాసరి రూ.106కోట్లు ఈ ఏడాది సంపాదించాడు.