దర్శక నిర్మాతలు సెలెక్ట్ చేసుకుంటారు: జమున

SMTV Desk 2017-12-03 17:47:26  jamuna, hyderabad,

హైదరాబాద్, డిసెంబర్ 3: అలనాటి అందాల నటి జమున తను సినిపరిశ్రమలో ఎదుర్కొన్న అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. తాను కథకు, పాత్రకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తానని, ఏ హీరో ఏంటి అనే ప్రశ్న అడుగనని చెప్పింది. ఆమెకు సినిమాలు చేస్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో ఓ ప్రశ్న ఎదురైందని చెప్పారు. ఆనాటి స్టార్ హీరో.. "మన కాంబినేషన్ బాగుంటుందని దర్శకులకు చెప్పాలి గదా .. నీ ఇష్టం వచ్చిన వాళ్లతో చేసేస్తావు.. అని అడుగగా, నాకు అలవాటు లేదండి .. దర్శక నిర్మాతలు సెలెక్ట్ చేసుకుంటారు" అని సమాధానమిచ్చానని తెలిపారు. అప్పటినుండి ఆ హీరోలు, ఆమెను పక్కకు పెట్టినా బాధపడకుండా వేరే హీరోలతో చేస్తూ వచ్చిందని పేర్కొన్నారు.