పాక్ వైఖరి పై అమెరికా అసంతృప్తి

SMTV Desk 2017-12-03 17:08:38  White House officer, pak, amerika

వాషింగ్టన్, డిసెంబర్ 03 ‌: ఉగ్రవాదులపై పోరులో పాక్‌ వైఖరి పట్ల అమెరికా అసంతృప్తిగా ఉందని వైట్ హౌస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి, జేయూడీ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ను విడుదల చేయడాన్ని అమెరికా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. సయీద్‌ విడుదలను ఆపకుండా పాక్‌ ప్రభుత్వం వెనుకడుగు వేసిందన్నారు. ‘ఐదేళ్ల పాటు హక్కానీ ఉగ్రవాదుల చెరలో ఉన్న కెనడియన్‌-అమెరికన్‌ దంపతులను రక్షించేందుకు పాక్‌ సహకరించింది. తాలిబన్‌, హక్కానీ నెట్‌వర్క్‌పై పాక్‌ తగిన చర్యలు తీసుకుంటుందని ఇప్పటికీ ఎదురు చూస్తున్నాం. కానీ పాక్‌ తీరు సంతృప్తికరంగా లేదు. ఆ దేశ వైఖరిలో ఎటువంటి మార్పులు ఇంకా రాలేదు. అయిన కూడా వెచ్చి చూస్తాం. ఒకవేళ మార్పు రాకపోతే.. పాక్‌పై తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన వెల్లడించారు.