2018 ఎన్నికల్లో జేయూడీ చీఫ్‌ హఫీజ్‌ పోటీ

SMTV Desk 2017-12-03 11:39:42  JUD Chief Hafeez, pakisthan, Elections, america

ఇస్లామాబాద్, డిసెంబర్ 03 ‌: ఎన్నో పేలుళ్లకు కారణమైన ఉగ్రవాద సంస్థ జేయూడీ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ నవంబర్‌ 24న గృహనిర్బంధం నుంచి విడుదలైన విషయం తెలిసిందే. కానీ అతడు చేసిన నేరాలను పరిగణలోకి తీసుకుని మళ్లీ అరెస్ట్‌ చేయాలని పాక్‌కు అమెరికా సూచించింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద జనవరి 31న హఫీజ్‌ని పాకిస్థాన్‌ గృహ నిర్భందం చేసింది. ఆ తర్వాత ఇటీవల విడుదల చేసింది. హఫీజ్‌ విడుదల అవడంపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, తాను 2018 సాధారణ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు శనివారం మీడియాకు వెల్లడించారు. ఎంఎంఎల్‌(మిలి ముస్లిం లీగ్‌) పార్టీ తరఫున తాను పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి అన్నది మాత్రం వెల్లడించలేదు. ఆగస్టులో జేయూడీ ఎంఎంఎల్‌ పార్టీని స్థాపించి సైఫుల్లా ఖలీద్‌ని పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించింది. పాకిస్థాన్‌ను ఎంఎంఎల్‌ నిజమైన ఇస్లామిక్‌ దేశంగా మారుస్తుందని అప్పట్లో ఖలీద్‌ ప్రకటించారు.