పర్వతంపై నుంచి విమానంలోకి.. విన్యాసం అదుర్స్...

SMTV Desk 2017-12-02 12:08:14  Fred Fugen, Weiss Refeet, Feat, Stunt

యూరప్, డిసెంబర్ 02 ‌: యూరప్ లో ఎత్తయిన పర్వతాల్లో ఒకటైన బంగీ లో ఓ ఇద్దరు యువకులు జంప్‌ చేసి ప్రయాణిస్తున్న విమానంలోకి ఎక్కారు. వినడానికే విచిత్రంగా ఉన్న ఈ విన్యాసాన్ని ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రెడ్‌ ఫ్యూగెన్‌, వీన్స్‌ రీఫెట్‌ అనే యువకులు చేశారు. వీరికి స్టంట్‌లు చేయడం అంటే చాలా ఇష్టం. అందులో భాగంగానే ఇటీవల ఓ భయానకమైన విన్యాసాన్ని ప్రదర్శించారు. యూరప్‌లోని ఎత్తయిన పర్వతాల్లో ఒకటైన జుంగ్‌ఫ్రౌ పర్వతం నుంచి ఈ ఇద్దరు బేస్‌ జంప్‌ చేశారు. అక్కడి నుంచి తమ వింగ్‌సూట్‌లతో గాల్లో ఎగిరారు. అలా వెళ్తూ వెళ్తూ, గాల్లోనే ఉన్న ఓ చిన్న విమానం ఎక్కారు. దీనికి సంబంధించిన వీడియోను రెడ్‌బుల్‌ యూట్యూబ్‌లో పోస్టు చేసింది. ఈ స్టంట్‌ కోసం వారు కొన్ని నెలలపాటు శిక్షణ తీసుకున్నారట. తమ కెరీర్‌కు ఇది చాలా ముఖ్యమైన విన్యాసమని, వారు చెబుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో జేమ్స్‌బాండ్‌‌ సినిమా చూసినట్లు అనిపిస్తుందన్నారు.