ప్రపంచ ఉత్తమ కళాకారిణిగా అనితా హజోర్త్‌...

SMTV Desk 2017-11-28 10:55:36  anitha hajorth, artist, singer, dancer, award

లండన్, నవంబర్ 28: ప్రముఖ డానిష్‌ పంజాబీ గాయని, నటి, నృత్యకారిణి అనితా హజోర్త్‌ లిర్చ్‌.. ప్రపంచ ఉత్తమ కళాకారిణి అవార్డుకు ఎంపికయ్యారు. బర్మింగ్‌హామ్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన యూకే భాంగ్రా అవార్డులు-2017 వేడుకలో ఈమెను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 24 మందికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ అవార్డుకు ఎంపికవ్వడంతో అనితా హజోర్త్‌ ఆనందంలో మునిగి పోయారు. ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.