క్ష‌మించండి.. ఏమ‌నుకోవ‌ద్దు : అనసూయ

SMTV Desk 2017-11-27 15:56:27  anchor,jabadasth , anasuya, actor , social media

హైదరాబాద్, నవంబర్ 27 : ప్రస్తుతం బుల్లితెర‌ పాపులర్ షో జబర్దస్త్ పై వివాదాల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఈ షో యాంకర్ అన‌సూయ తను చేసిన కొన్ని వ్యాఖ్యలపై నెటిజన్లను క్షమాపణలు కోరింది. ‘‘అరే.. నేను అస‌భ్య‌క‌ర‌మైన డైలాగ్‌ల గురించి మాట్లాడితే బ‌ట్ట‌లు స‌రిగా వేసుకోమంటారు. నేను ఫ‌న్‌ని ఫ‌న్‌లా తీసుకోండంటే..`అర్జున్ రెడ్డి` అంటారు. ఏందివ‌య్యా.. దిమాక్‌ అటుది ఇటు.. ఇటుది అటు అయిందా` అని ట్వీట్ చేసింది. అనంత‌రం `క్ష‌మించండి.. ఏమ‌నుకోవ‌ద్దు.. వితండ‌వాదాలు చేసేవాళ్ల‌ని, ఊరికే గెలుకుదాం అనుకునేవాళ్ల‌ని, నెగిటివ్‌గా మాట్లాడేవాళ్లని బ్లాక్ చేద్దామ‌ని నిర్ణయించుకున్న. నా ఆనందం నా చేతుల్లో ఉన్న‌ట్టు, మీరు కూడా మీకు ఏది న‌చ్చితే అది చెయ్యండి. నిజాయితీగా, ఆనందంగా ఉండే వ్య‌క్తులే నా చుట్టూ ఉండాల‌ని కోరుకుంటా’’ అంటూ మ‌రో ట్వీట్ చేసింది.