ఆప్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య

SMTV Desk 2017-11-24 15:55:58  isis, terrorist, afghanisthan, kabul region

కాబుల్, నవంబర్ 24 : ప్రపంచ దేశాలను తమ, పాశావిక చర్యలతో గడగడలాడిస్తున్న ఐసిస్‌ ఆప్ఘనిస్తాన్‌లో ఓ దుశ్చర్య కు పాల్పడింది. ఏకంగా తమ బృందంలో గల 15 మంది సొంత ఫైటర్ల తలలను తెగ నరికింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు అంతర్జాలంలో షేర్‌ అవుతోంది. ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్‌లోని డాయిష్‌ ప్రాంతంలో ఐసిస్‌ తన ఆధిపత్యాన్ని చాటుకొంటుంది. అక్కడ తలెత్తిన అంతర్గత గొడవలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే, ఐసిస్‌ ఈ విషయంపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన జారీ చేయకపోవడం విశేషం.