ట్రంప్‌ పై బాల్డ్‌విన్‌ సంచలన వ్యాఖ్యలు

SMTV Desk 2017-11-24 15:06:28  us president, trump, actor billy baldwin, london

లండన్, నవంబర్ 24 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై, నటుడు బిల్లీ బాల్డ్‌విన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన భార్యపై ట్రంప్‌ చెయ్యి చేసుకున్నాడని బెల్లీ తెలిపారు. మన్‌హట్టన్‌ హోటల్‌లో సుమారు రెండు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటన ప్రస్తావిస్తూ బిల్లీ సందేశం ఉంచాడు. ‘‘లైంగిక దాడులలో మీ నాన్నకు(ట్రంప్‌ను ఉద్దేశించి) బ్లాక్‌ బెల్ట్‌ ఇవ్వొచ్చు. ప్లాజా హోటల్‌లో ఓసారి నేను ఇచ్చిన పార్టీకి పిలవకపోయినా మీ నాన్న వచ్చాడు. ఎటువంటి కారణం లేకుండానే నా భార్యపై చెయ్యి చేసుకున్నాడు. తన హెలికాప్టర్‌లో అట్లాంటాకు రావాలంటు పిలిచాడు.. అంటూ మరింత సమాచారంతో ఓ ట్వీట్‌ చేశాడు. డెమొక్రటిక్‌ పార్టీ సెనేటర్‌ అల్‌ ఫ్రాంకెన్‌పై లైంగిక ఆరోపణలు రాగా, ట్రంప్‌ కొడుకు ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించాడు. ఆ వెంటనే బిల్లీ దానికి రీ-ట్వీట్‌ చేయటం విశేషం. గతంలో బిల్లీ, ట్రంప్ స్నేహంగా ఉండేవారు. తర్వాత రాను రాను వారిద్దరి మధ్య వైరం మొదలైంది. కారణాలు తెలియనప్పటికీ అధ్యక్ష ఎన్నిక ప్రచారం నుంచే బిల్లీ, ట్రంప్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాడు.