ప్రారంభమైన నమిత పెళ్లి వేడుకలు...

SMTV Desk 2017-11-22 16:48:28  namitha, mehandi, veerendra chowdary, namitha marriege

హైదరాబాద్, నవంబర్ 22‌: ప్రముఖ నటి నమిత తన ప్రియుడు వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. నవంబరు 24న తిరుపతిలో వీరి పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందు మెహందీ ఫంక్షన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నమిత తన చేతులకు మెహందీ పెట్టించుకుంటుండగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నమిత చిట్టి గులాబి ఆకారంలో తయారు చేసిన ఆభరణాలు ధరించి చక్కగా కనిపించారు. వీరేంద్ర తన స్నేహితుడని, గత కొన్ని రోజులుగా ఇద్దరం ప్రేమించుకుంటున్నామని నమిత ఇటీవల చెప్పారు. తమది పెద్దలు నిశ్చయించిన ప్రేమ వివాహం అన్నారు. 2016లో తన స్నేహితుడు శశిధర్‌బాబు ద్వారా నటుడు, నిర్మాత అయిన వీరేంద్ర పరిచయం అయ్యారని తెలిపారు. 2017 సెప్టెంబరు 6న బీచ్‌లో ఆయన ప్రపోజ్‌ చేసి, సర్‌ప్రైజ్‌ చేశారని పేర్కొన్నారు. ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు ఒకటి కావడంతో వెంటనే అంగీకరించినట్లు చెప్పారు.