సెలబ్రిటీ న్యాయవాదిగా త్రిష...

SMTV Desk 2017-11-21 10:53:32  trisha, unicef celebrity advocate, chennai,

చెన్నై, నవంబర్ 21: తెలుగు, తమిళ చిత్రాలలో తనదైన శైలిలో నటించి తన అందంతో, అబ్బురపరిచే నటనతో ఆకట్టుకున్న అందాల తార త్రిష, యునిసెఫ్‌ సెలబ్రిటీ న్యాయవాదిగా నియమితులయ్యారు. ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా చెన్నైలో జరిగిన కార్యక్రమంలో సెలబ్రిటీ న్యాయవాది (అడ్వకేట్‌)గా నియమిస్తున్నట్లు యునిసెఫ్‌ వర్గాలు ప్రకటించాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సంబంధించి ఆమె ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ రాష్ట్రాల్లో బాలలకు వ్యతిరేకంగా జరిగే చర్యలపై ఆమె గళ మెత్తుతారు. ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ..." ఈ అవకాశం నాకు మరింత గౌరవాన్ని, బాధ్యతను పెంచుతుంది. చిన్నారుల విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, రక్షణ వంటి అంశాలపై అవగాహన కలిగించనున్నా" అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి పైగా చిన్నారులతో త్రిష మాట్లాడారు. ఈ ప్రత్యేకతను సొంతం చేసుకున్న తొలి దక్షిణాది నాయిక ఈమే కావడం విశేషం.