ముగాబే కథ ముగిసింది !

SMTV Desk 2017-11-20 14:19:34  zim

హరారే, నవంబర్ 20 : 1.61 కోట్ల గల జనాభా...3.90 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల జింబాబ్వే లో గత కొద్దిరోజులుగా ముదిరిన రాజకీయ సంక్షోభంకు ఎట్టకేలకు తెరపడింది. ప్రపంచంలోనే సుదీర్ఘ కాలం ఒక దేశాన్ని పాలించిన నేతగా చరిత్ర సృష్టించిన రాబర్ట్‌ ముగాబేను, అధ్యక్షుడి స్థానం నుండి తొలిగిస్తున్నట్లు పార్టీ ప్రతినిధులు ప్రకటించారు. ఆయన స్థానంలో పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు ఎమ్మార్సన్‌ నంగ్వాంగ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు అధికారికంగా ధ్రువీకరించారు. ప్రస్తుత జింబాబ్వే ను పూర్వం దక్షిణ రోడిషియగా వ్యవహరించేవారు. ముగాబే దేశ స్వాతంత్ర్య౦ కోసం అలుపెరగని పోరాటం చేసి, బ్రిటిష్ వారి చెర నుండి ప్రజలను విముక్తి చేసిన ఘనుడిగా పేరుపొందాడు. ఆ దేశ ప్రధానిగా 1980 ఏప్రిల్ 17 న ప్రమాణ స్వీకారం చేసి 37 ఏళ్ల పాటు, అప్రతిహతంగా పాలన కొనసాగించారు. 93 ఏళ్ల వయస్సున్న ముగాబే తన రాజకీయ వారసురాలిగా భార్య, గ్రేస్ ముగాబేను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయడంతో, సైన్యం అతనిని గత మంగళవారం నుండి గృహనిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే.