నా ప్రేమ‌, గౌర‌వం నీకే నా తంగ‌మ్మే నయన : విఘ్నేశ్

SMTV Desk 2017-11-18 19:36:25  nayantara, Vignesh Shivan, Velaikkaran,

చెన్నై, నవంబర్ 18: తమిళ, తెలుగు భాషలలో వైవిధ్యమైన పాత్రలను పోషించి, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల తార నయన తార పుట్టిన రోజు నేడు. ఈ రోజుతో ముద్దుగుమ్మకు 32 ఏళ్ళు నిండాయి. ఆమె జన్మదిన౦ సందర్బంగా... దర్శకుడు విఘ్నేశ్ శివ‌న్ ఓ స్పెషల్ ట్వీట్ చేశాడు. " నేను ఎంతో గౌరవించే మహిళకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాగే ధైర్యంగా, అందంగా ఉండు. న‌య‌న‌తార అంటే ఏంటో చూపిస్తూ ఉండు. నిన్ను చూస్తే ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది. నా ప్రేమ‌, గౌర‌వం నీకే నా తంగ‌మ్మే" అంటూ ట్వీట్ చేశాడు. వాళ్లిద్దరూ క‌లిసి ఉన్న ఫొటోను కూడా షేర్ చేశాడు. గత కొద్ది కాలంగా విఘ్నేశ్, నయన ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.