రక్తదానం చేసిన కొనిదేల, నారా వారి కోడళ్ళు...

SMTV Desk 2017-11-18 14:48:29  upasana, brahmani, blood donation

హైదరాబాద్, నవంబర్ 18: సరికొత్త విషయాలను పరిచయం చేస్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో నిలుస్తుంటుంది కొనిదేల వారి కోడలు ఉపాసన. తాజాగా ఆమె తన ఫేస్ బుక్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. "ఈ రోజు మధ్యాహ్నం నారా బ్రాహ్మణి, తాను కలిసి రక్తదానం చేశారాని తెలిపారు. ఈ సందర్బంగా బ్రాహ్మణి.. ఈ రక్తదానం 18 ఏళ్ల వయసులో ప్రారంభిస్తే ప్రతి 90 రోజులకు ఒక్కసారి 60 ఏళ్ల వచ్చే వరకు రక్తదానం చేయవచ్చని, 500 జీవితాలను కాపాడే సత్తా మీకు ఉంటు౦దని పాసునకు తెలిపింది. ఇది ఎంతో శక్తివంతమైన సహాయం అని, మనకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని" పోస్ట్ చేశారు. వీరిద్దరి సమాజ సేవకు నెటిజన్లు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.