గగనంలో విమానం,హెలికాప్టర్‌ ఢీ..

SMTV Desk 2017-11-18 12:28:43  Airplane, helicaftr, london

లండన్, నవంబర్ 18: ఆకాశంలో ఎగరాల్సిన విమానాలు, ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటన ఇంగ్లండ్‌లోని హాల్టన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... విమానయానంలో శిక్షణ ఇచ్చే వైకోమ్‌ ఎయిర్‌ పార్కు నుంచి బయల్దేరిన ఓ విమానం, ఓ హెలికాప్టర్‌ రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ బేస్‌ సమీపంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. సమాచారమందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటిపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టినట్లు యూతే ఎయిర్‌ ఆక్సిడెంట్స్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్రాంచ్‌(ఏఏఐబీ) అధికారులు వెల్లడించారు.