అమ్మాయి శాస్త్రవేత్త.. అబ్బాయి ఆర్టిస్టు..: రోజా

SMTV Desk 2017-11-16 18:26:03  MLA ROJA, YCP, NAGARI,

హైదరాబాద్, నవంబర్ 16: సినీ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు, రాజకీయాలలో తనదైన ముద్ర కనబరిచిన నటి, ఎమ్మెల్యే రోజా, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... " మా కుటుంబ౦లో ఆర్టిస్టుగా ఎవ్వరూ లేరు. అయినప్పటికీ నేను సినీ రంగంలో ప్రవేశించాను. ఈ సినిమాల ద్వారానే రాజకీయాలలోకి ప్రవేశించే అవకాశాన్ని దేవుడు కల్పించాడు. మా ఇంట్లో నా భర్త చాలా అర్ధం చేసుకుంటారు. ప్రస్తుతం పిల్లలు చదువుపైనే దృష్టి పెట్టారు. మా అమ్మాయి శాస్త్రవేత్త కావాలని అంటుంది. అబ్బాయి మాత్రం ఆర్టిస్టు లేక‌ పొలిటిషియ‌న్ అవుతానని అంటాడు" అని చెప్పారు.